సంతనూతలపాడు: చీమకుర్తి మండలం పాటిమీద పాలెం లో సంక్రాంతి క్రికెట్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
చీమకుర్తి మండలం పాటిమీద పాలెం లో సంక్రాంతి పర్వదినం సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీలు ఫైనల్ మ్యాచ్ సోమవారం ముగిసింది. సంతనూతలపాడు ఎమ్మెల్యే BN విజయ్ కుమార్ ఫైనల్ మ్యాచ్లో విజేతలుగా నిలిచిన పాటిమీద పాలెం అంబేద్కర్ యూత్ మరియు రన్నర్ గా నిలిచిన పల్లామల్లి జట్టుకు బహుమతి ప్రధానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల్లో యువత రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక వికాసానికి, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.