అసిఫాబాద్: కపాస్ కిసాన్ యాప్ ను రద్దు చేయాలని వాంకిడి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన CPI జిల్లా నాయకులు
కపాస్ కిసాన్ యాప్ ను రద్దు చేయాలని, ఎలాంటి నిబంధనలు లేకుండా పత్తి రైతుల వద్ద ఉన్న పత్తిని సిసిఐ పూర్తిగా కొనుగోలు చేయాలని CPI జిల్లా సహాయక కార్యదర్శి చిరంజీవి డిమాండ్ చేశారు. సోమవారం వాంకిడి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు.. దళారీ వ్యవస్థను రద్దు చేయాలని, 12 శాతం తేమ నుంచి 20 శాతం వరకు సడలింపు ఇవ్వాలని కోరారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వం రైతుకు మద్దతు ధర ఇవ్వాలని చిరంజీవి కోరారు.