స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుండి మనిషికి వ్యాపించదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు కర్నూలు కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి వైద్య బృందంతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాధి వ్యాప్తి గురించి కలెక్టర్ ఆరా తీశారు.నవంబర్ నెల, ఈ రోజు వరకు 44 పాజిటివ్ కేసులు వచ్చాయని, అందరికీ చికిత్స అందించామని 39 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 5 మంది ఆసుపత్రిలో ఉన్నారని జీజీహెచ్ సూపరింటెండెంట్ వివరించారు.