పెళ్లకూరు (మం)లో సమస్యలపై ప్రజా దర్బార్
- ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే విజయశ్రీ
తిరుపతి జిల్లా పెళ్లకూరు ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ప్రజల సమస్యల కొరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజాదర్బార్ లో పాల్గొని ప్రజల వద్ద నుంచి సమస్యల అర్జీలను స్వీకరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచనలు జారీ చేశారు. మొత్తం 40 అర్జీలను స్వీకరించి, వెంటనే పీజిఆర్ఎస్ లో ఆన్లైన్గా నమోదు చేయించారు. మండల, జిల్లా స్థాయి అధికారులు హాజరై ప్రజల సమస్యలను నమోదు చేసి, అవసరమైనచోట తక్షణ చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రజల సమస్య