ముధోల్: బాసర గోదావరిలో రెండు రోజుల నుండి పెరుగుతున్న వరద.....
Mudhole, Nirmal | Sep 17, 2025 నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.ఎగువన మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలకు బాసర వద్ద గోదావరి నదికి రెండు రోజుల నుండి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ పర్బాని జిల్లా పరిధిలో వర్షాలు ఏకధాటిగా కురుస్తుండడంతో గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద ఉధృతి పెరుగుతుండడంతో గోదావరి నది తీరం వద్ద భక్తుల పుణ్య స్నానాల ఘట్టాల వద్ద పోలీసులు అనుమతిని ఇవ్వడం లేదు.నది లోపలికి వెళ్లకుండా ప్రత్యేకంగా భారికేడ్లు ఏర్పాటు చేశారు.గోదావరి బ్యాక్ వాటర్ తో ఆలయం నుంచి గోదావరి నదికి ఉండే మార్గంలో వరద నీరు వచ్చి చేర