ఖానాపూర్: యూరియా కోసం పిఎసిఎస్ కు వెళ్లిన రైతును తోసి వేశాడని ఆరోపిస్తూ కడెం మండల రైతులు ధర్నా
కడెం మండల కేంద్రంలో యూరియా కోసం పీఏసీఎస్ కార్యాలయానికి వెళ్లిన ఒక రైతును అధికారి తోసివేశాడని ఆరోపిస్తూ కడెం మండల కేంద్రంలో సోమవారం రైతులు ధర్నాకు దిగారు. తమకు సరిపడా యూరియా సరఫరా చేయాలేక యూరియా కోసం కార్యాలయానికి వెళ్లిన రైతును తోసేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రైతులపై భౌతిక దాడులకు యత్నించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. వారికి బిఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.