భీమిలి: కాపులప్పాడ గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ సహాయ అధికారులు
భీమిలి మండలం కాపులప్పాడ గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమిలి వ్యవసాయ సహాయ సంచాలకులు బి విజయ ప్రసాద్, వ్యవసాయ అధికారి బి.శివ కోమలి వరిపొలాలను రైతులతో పాటు సందర్శించారు. ప్రస్తుతము వరి పొలాల్లో ఆకు ముడత తెగులు ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. వరి పంట పిలక దశలో ఉన్నందున ఆకు ముడత తెగులు నివారణకు గాను ఒక ఒక ఎకరానికి అయితే క్లోరోపైరీఫాస్ 400 మిల్లీ లీటర్లు మందును 300-400 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు.