ఖమ్మం అర్బన్: పిల్లలకు ఆకర్షణీయంగా క్రచ్ సెంటర్ ను తీర్చిదిద్దాలి: కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
క్రచ్ సెంటర్ ను పిల్లలకు ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, కలెక్టరేట్ లోని క్రచ్ సెంటర్ ను అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి తనిఖీ చేసారు.క్రచ్ సిబ్బంది రాణిని రోజువారి ఎంత మంది పిల్లలు ఉంటున్నది, అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రాబోయే వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని క్రచ్ సెంటర్లో ఏసి ఏర్పాటు చేయాలని, డోర్ మూసినప్పుడు చీకటి రాకుండా సెమీ ట్రాన్స్పరెంట్ డోర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.