గుడూరు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో కార్టెన్ సెర్చ్.. సరైన పత్రాలు లేని ఐదు వాహనాలు స్వాధీనం
Gudur, Tirupati | Nov 16, 2025 గూడూరు రూరల్ ఎస్ఐ తిరుపతయ్య ఆదివారం గూడూరు టౌన్, రూరల్ పోలీసు సిబ్బందితో కలిసి గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో దాదాపు 90 ఇళ్లు, 35 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ మాట్లాడుతూ.. నిషేధిత మత్తు పదార్ధాలు వినియోగించకూడదన్నారు.