శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలోని జిమ్ లో శుక్రవారం బాడీ బిల్డర్లను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట్ ప్రసాద్ అభినందించారు. ఇండోనేషియాలోని బతంగ్ లో జరిగిన ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీలలో కదిరికి చెందిన బాడీ బిల్డర్లు ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవడంతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. దేశ ప్రతిష్ఠతను ప్రపంచానికి తెలియజేసిన బాడీ బిల్డర్లకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు.