తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం రాయదుర్గంలో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరం పోస్టర్లను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆవిష్కరించారు. పట్టణంలోని సీతారామంజినేయ కల్యాణ మండపంలో రక్తదాన శిబిరానికి సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. రక్త దాతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం పార్టీ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు , రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చ