నంద్యాల ఎంఎల్సీ ఇసాక్ బాషాను మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కలిసి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బకాయిలను 2026–27 బడ్జెట్లో కేటాయించాలని కోరారు. వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అభ్యర్థించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సభలో ప్రస్తావిస్తానని MLC హామీ ఇచ్చారు.