రాపూరులో స్వచ్ఛ్ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమం.. ఎంపీడీవో భవాని ఆధ్వర్యంలో వెలుగు సిబ్బంది ర్యాలీ
Gudur, Tirupati | Nov 15, 2025 నెల్లూరు జిల్లా ,రాపూరు ప్రజా పరిషత్ కార్యాలయం నందు అన్ని శాఖల అధికారులతో కలసి ఎంపీడీవో భవాని స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వెలుగు సిబ్బందితో కలిసి అధికారులు రాపూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞను చేశారు. అనంతరం ఎంపీడీవో భవాని మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న , నెలలో మూడవ శనివారం స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమని అన్ని కార్యాలయంలో నిర్వహించామన్నారు.