నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి చెందిన 25 వేల కోడిగుడ్లు మాయమైన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంపై కలెక్టర్కు ఫిర్యాదు అందడంతో విచారణ ప్రారంభమైంది. విచారణలో 12 వేల గుడ్లు పాడయ్యాయని నివేదిక వచ్చినట్లు సమాచారం. మిగిలిన గుడ్లను రికవరీ చేయాలని అధికారులు సూచించారు. అయితే, ఈ వ్యవహారంపై గుట్టుగా విచారణ జరపడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.