కన్నాయిగూడెం మండలం తుపాలగూడెంలోని గోదావరిలో ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లిన జాలర్లకు ఓ వింత చేప చిక్కింది. దెయ్యం చేప అనే పేరు గల ఈ చేప వలలో చిక్కడంతో స్థానికులు దీనిని ఫోటోలు తీసి వైరల్ చేశారు. అయితే ఈ చేప నదుల్లో, చెరువుల్లో ఉండడం ద్వారా ఇతర చేపలకు హానికరమని జాలర్లు తెలిపారు.