పెగడపల్లె: పెగడపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు పెగడపల్లి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాములు గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీలకు అతీతంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందని అన్నారు.