కాలేషా భాయ్ కి ఎమ్మెల్యే, ప్రముఖుల నివాళులు
Gudur, Tirupati | Nov 16, 2025 గూడూరు కాస్మోపాలిటన్ క్లబ్లో ఆదివారం సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా సంతాప సభనిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్, సీపీఐ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. కాలేషా సేవలను గుర్తు చేశారు. 40 ఏళ్లుగా ఎర్రజెండా నీడన అలుపెరుగని పోరాటాలు చేశారని కాలేషా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, వైసీపీ, టీడీపీ, బీఎస్పీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.