భీమిలి: జూ పార్క్ వద్ద క్రేన్ డీకొని తుప్పలలోకి దూసుకెళ్లిన ఆర్టీసి బస్సు, బస్సు లో ఉన్న ఇద్దరు ప్రయానికులు సురక్షితం
జూ పార్క్ సమీపంలో జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసి కాంప్లెక్స్ నుండి పార్వతీపురం వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఆర్టీసి బస్సు క్రేన్ డీకొనటం తో డివైడర్ మీదగా తుప్పల్లోకి దూసుకెళ్లి ప్రమాదం జరిగింది. ఆర్టీసి బస్ లో ఇద్దరు ప్రయానికులు ప్రయానిస్తున్నారు. వారికి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు అని స్థానికులు తెలిపారు. ఇద్దరిని మరో ఆర్టీసి బస్సు లో సురక్షితంగా తరలించారు. బస్సు క్రేన్ ని డీ కొనటంతో మరో వైపుకి క్రేన్ ఒరిగిపోగా బస్సు తుప్పల్లోకి దూసుకెళ్ళింది.