కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 5 వ వార్డులో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ శనివారం పర్యటించారు. వార్డులో ఇటీవల నిర్మించిన సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచి పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు మున్సిపల్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన మున్సిపల్ చైర్మన్... మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డుతో పాటు పట్టణంలో ఇటీవల ప్రారంభించి అసంపూర్తిగా నిలిచిపోయిన సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు వంటి అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.