జిల్లాలో ప్రమాదాల వల్ల గాయపడిన జంతువుల సంరక్షణ కోసం అవసరమైన పశు వసతి గృహాల ఏర్పాటుకు తగిన స్థల సేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులు ఆదేశించారు.కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లా జంతు సంరక్షణ కమిటీ కింద ఏర్పాటు అయిన డిస్టిక్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రియాటి టు అనిమల్స్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ అధికారి గోవిందు నాయక్ మున్సిపల్ కమిషనర్ సీసన్న జంతు సంరక్షణ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు