నెల్లిమర్ల: నెల్లిమర్ల మండలంలో పది ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హవా
నెల్లిమర్ల మండలంలో సోమవారం విడుదల చేసిన పదోతరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు హవా చాటారు. నెల్లిమర్ల జ్యోతిబాఫూలె బిసి బిసి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 78 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 78 ఉత్తీర్ణత సాధించి శతశాతం ఫలితాలు సాధించారు. కె ధరణి 585 మార్కులు సాధించి ప్రథమస్థానంలో నిలిచింది. జె ప్రవళ్లక 572, బి మానస 569 మార్కులు సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ రమా మోహిణి అభినందించారు. అలాగే బొప్పడాం ఉన్నత పాఠశాల విద్యార్థులు దుర్గా దిషిత 591 మార్కులు, చంద్రకేశ్వరి 581 మార్కులు సాధించారు. 20 మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు.