ధర్మారం: మూడు నెలల జీతాలు విడుదల చేయాలని ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల వినతి పత్రం
ధర్మారంలో ఈ-పంచాయతీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు తమకు గడిచిన మూడు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని, అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ధర్మారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఐనాల, ఎంపీఓ రమేష్ కు మండల ఈ-పంచాయతీ ఆపరేటర్లు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈ-పంచాయతీ ఆపరేటర్లు పాల్గొన్నారు.