మార్కాపురం మండలం రాయవరం గ్రామ సమీపంలోని పలకల క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు 9వ తరగతి విద్యార్థి ఏసుబాబు మృతి చెందారు. పూల సుబ్బయ్య కాలనీకి చెందిన ఏసుబాబు తన స్నేహితులు జాన్ వెస్లీ, అభిరామ్ లతో కలిసి క్వారీ గుంత వద్ద ఫోటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడిపోయారు. మిగిలిన స్నేహితులు స్థానికులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ సుబ్బారావు తెలిపారు.