నెల్లిమర్ల: ఎన్నికల నిర్వహణలో ఆర్థిక లావాదేవీలపై పటిష్ట నిఘా ఉంచాలి: విజయనగరంలో రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం
ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా అధికారులను రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలు, నగదు బట్వాడా, బహుమతులు, ఇతర వస్తువులు తరలింపు, మద్యం రవాణా తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. అధికారులు అందరిపట్లా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు.