విశాఖ-అరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విజయనగరం జిల్లా ఎస్.కోటRTC డిపో ఎదురుగా ఉన్న కల్వర్టు కూల్చివేతను స్థానికులు మంగళవారం అడ్డుకున్నారు. నెల రోజుల క్రితం ఇదే కల్వర్టు కూల్చివేయడంతో రాకపోకలకు అవస్థలు పడ్డామని మండిపడ్డారు. ఎన్నిసార్లు కూల్చివేసి పునర్నిర్మాణం చేపడతారని ప్రశ్నించారు. 4 రోజుల్లో కల్వర్టు నిర్మాణం పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.