మార్కాపురం జిల్లా దోర్నాల మండలం రామచంద్ర కోట సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల లోడుతో వెళ్తున్న టాటా ఏసీ వివాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కూరగాయలు నేలమట్టమయ్యాయి. డ్రైవర్ కు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మార్కాపురం నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ వెల్లడించారు.