అతి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతానని తాడిపత్రికి చెందిన వైసీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నేత మున్నా గయాజ్ అన్నారు. తాడిపత్రిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీలో గత 13 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నానన్నారు. అయితే సరైన గుర్తింపు లేదన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ పైన నమ్మకంతో త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతానన్నారు. 2024 ఎన్నికలు ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి తనను పార్టీలోకి ఆహ్వానించారన్నారు. అయితే అప్పుడు తాను తిరస్కరించానన్నారు. తాడిపత్రిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జేసీ సమక్షంలో టీడీపీ లో చేరుతానన్నారు.