శ్రీరామనవమి పురస్కరించుకుని మునగపాక మండలం గవర్ల అనకాపల్లిలో సీతారాములకు ఘనంగా పంచామృతాభిషేకం
మునగపాక మండలం గవర్ల అనకాపల్లి గ్రామంలోని గౌరీ గిరి రామాలయంలో సీతారామచంద్రులకు మంగళవారం ఉదయం పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయంలో విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సీతారాములకు మంగళ స్నానాలు చేయించారు.శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకొని ఈనెల 17వ తేదీన కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తామని గ్రామ పెద్దలు అన్నారు.