సురుటుపల్లి లోని శ్రీ పల్లికండేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తిశ్రద్ధలతో నందీశ్వరునికి ప్రదోష అభిషేక పూజలు
సురుటుపల్లి: భక్తి శ్రద్ధలతో నందీశ్వరునికి ప్రదోష అభిషేక పూజలు సురుటుపల్లిలోని శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం త్రయోదశి సందర్భంగా నందీశ్వరునికి ప్రదోష అభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో జరిగింది. నందీశ్వరునికి పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు చందనంతో అభిషేకాలు చేశారు. భక్తులు సమర్పించిన పచ్చగడ్డి, వివిధ రకాల పుష్పాలు, పండ్లతో నందీశ్వరుని సుందరంగా అలంకరించారు. ఆలయ ఛైర్మన్ పద్మనాభ రాజు పర్యవేక్షణలో స్వామివారికి ధూప దీప నైవేద్యాలు మహా హారతులు అందించారు.