పెగడపల్లె: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ముగ్గు పోసిన పెగడపల్లి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్
పెగడపల్లి మండలం ఏడు మోట్లపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ లాస్యశ్రీతో కలిసి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ శుక్రవారం మధ్యాహ్నం ముగ్గు పోసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.