రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా పరిధిలో రామోజీ ఫిలిం సిటీ లో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు
మీడియా దిగ్గజం, అక్షరయోధుడు రామోజీరావు (87) అంత్యక్రియలు ముగిశాయి. TG ప్రభుత్వ లాంఛనాలతో HYD ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో కొడుకు కిరణ్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు జరిగాయి. అంతకుముందు ఆయన అంతిమ యాత్రలో సినీ, రాజకీయ ప్రముఖులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. తన సంస్థల ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించిన ఆయన కోట్ల మందికి 'మార్గదర్శి'గా నిలిచారు. అందరినీ శోకసంద్రంలోకి నెట్టి ఇక సెలవంటూ దివికేగారు