అనంతపురం నగర శివారులోని అనంతపురం రూరల్ మండల పరిధిలో ఉన్న కందుకూరు గ్రామంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం లో నుంచి పడడంతో ప్రమీలమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.