ప్రకాశం జిల్లా ఒంగోలు పరిసర ప్రాంతాలలోని చెన్నై కోల్కత్తా జాతీయ రహదారిపై బుధవారం పొగ మంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం 9 గంటల దాటినప్పటికీ పొగ మంచు వెడకపోవడంతో రహదారిపై కనీసం 20 అడుగుల మేర సరిగా కనపడక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు జాతీయ రహదారిపై భారీగా పండుగ వేళ వాహనాల రద్దీ ఉన్న నేపథ్యంలో పొగ మంచుతో ముందుకు పోలేక ఆగలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనాలకు లైట్లు ఇండికేటర్లు ఆన్ చేసుకొని నిదానంగా రహదారిపై ప్రయాణం చేశారు ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయని రవాణా శాఖ అధికారులు కూడా తగిన జాగ్రత్తలను చేపడుతూ ఎక్కడికక్కడ వాహనదారులకు జాగ్రత్తలు తెలియజేశారు.