ధర్మపురి: దోనూర్ గ్రామంలో అర్ధరాత్రి కత్తిపోట్ల కలకలం, చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ధర్మపురి మండలంలో దోనూర్ గ్రామంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. ఇంటి దారి విషయంలో గొల్లన రవి అనే వ్యక్తిని నాగరాజు గురువారం రాత్రి కత్తితో పొడిచాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో రవిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ధర్మపురి ఎస్సై ఉదయ్ కుమార్ శుక్రవారం తెలిపారు.