ప్రకాశం జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ, మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ మరియు పోలీస్ అధికారులు సోమవారం ఒంగోలు, జిల్లా పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ సమస్యలకు సంబంధించిన వ్రాతపూర్వక అర్జీలను పోలీస్ అధికారులకు అందించి, వారియొక్క సమస్యలను వివరించారు.