మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్
Mylavaram, NTR | Sep 20, 2025 మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి జోగి రమేష్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శనివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఇబ్రహీంపట్నంలో ఆయన మీడియాకు ఒక వీడియోను విడుదల చేశారు. నియోజకవర్గ సమస్యలపై వసంత కృష్ణ ప్రసాద్ అసెంబ్లీలో ప్రస్తావించటం గాని పరిష్కరించటం గాని చేయలేదని మండిపడ్డారు.