హుస్నాబాద్: ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీలో మహిళలు 200 కోట్ల జీరో టికెట్ల ప్రయాణం సందర్భంగా సంబరాలు:గ్రంధాలయ చైర్మన్ లింగమూర్తి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ లో మహిళలు 200 కోట్ల జీరో టికెట్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకొని డబ్బులు ఆదా చేసుకున్న విద్యార్థినులు, మహిళలను, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను బహుమతులు, శాలువాలతో జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ కేడం లింగమూర్తి, ఆర్టీసీ డిఎం వెంకన్న తదితరులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో తాము పొందుతున్న లబ్ధి గురించి వివరించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ప్రయాణికుల్లో దాదాపు