ఎస్ఎన్. గొల్లపాలెం మండల కేంద్రమైన గూడూరులో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
Machilipatnam South, Krishna | Sep 25, 2025
జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వారు నివసించే గ్రామాలు, పట్టణాల్లో కూడా జరిగే స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి పురస్కరించుకొని ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా గురువారం మధ్యాహం ఒంటిగంట సమయంలో జిల్లా కలెక్టర్ స్తానిక మచిలీపట్నం మండలంలోని ఎస్ఎన్. గొల్లపాలెం గ్రామం, మండల కేంద్రమైన గూడూరులో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.