కొడుకు మృతికి కారణమైన యాడికి మండలం చందన లక్ష్యం పల్లి గ్రామానికి చెందిన రమేష్ ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను యాడికి పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు. ఈనెల 16న రమేష్-మహేశ్వరి దంపతులు గొడవపడ్డారు. రమేష్ కోపంతో భార్య పైకి రాయి విసిరాడు. ఆ రాయి కాస్త నాలుగేళ్ల కుమారుడు రాహుల్ కు తగిలింది. కర్నూల్ ఆసుపత్రిలో మృతి చెందాడు. కొడుకు మృతిక కారణమైన రమేష్ ను అరెస్టు చేశారు. నిందితుని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ కు ఆదేశించినట్లు సీఐ చెప్పారు.