చీటీ డబ్బులు కట్టలేదని వేధింపులు తట్టుకోలేక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం..
Gudur, Tirupati | Nov 17, 2025 చీటీ పాట డబ్బులు కట్టలేదని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో పాటు అందరిని అసభ్యకర పదజాలంతో తిడుతున్నాడని మనస్థాపానికి గురైన వ్యక్తి పురుగుల మందు తాగిన ఘటన కలువాయి మండలం వెంకటరెడ్డి పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వెంకటరెడ్డి పల్లి గ్రామం జంగాల కాలనీకి చెందిన తిరుపతి విక్రమ్ అదే గ్రామానికి చెందిన జాతీకతుల చిట్టయ్య దగ్గర చీటీ వేశాడు. ప్రతి నెల చిట్టి కట్టవలసిన పరిస్థితిలో ఏ పని దొరక్క డబ్బులు కట్టడం ఆలస్యమైన నేపథ్యంలో చిట్టీలు వేసిన జాతి కత్తుల చిట్టయ్య.. తిరుపతి విక్రమ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల తో కలిపి అసభ్యకర పదజాలంతో తిడుతూ అందరికీ పురుగులు మందు పోసి