జనసంఘ్ వ్యవస్థాపకులు డా.శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని ఒంగోలులో ఆదివారం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు డాక్టర్ నిడమానూరి సూర్య కల్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.కల్యాణ్ చక్రవర్తి వికసిత భారత్ ఫౌండేషన్ ఆఫీస్ లో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జి చిత్రపటానికి కల్యాణ్ చక్రవర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. "ఏక్ దేశ్ మే దో విధాన్ - ఏక్ దేశ్ మే దో నిశాన్ ఏక్ దేశ్ మే దో ప్రధాన్ నహీ చలేంగే నహీ చలేంగే" అంటూ కాశ్మీర్ కోసం పోరాడిన గొప్ప మహనీయులు అని కొనియాడారు