భక్తులతో కిటకిటలాడిన నాగేశ్వర స్వామి దేవస్థానం
- కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు
కార్తీక మాసం సోమవారం సందర్భంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమశివాయ అంటూ భక్తులు ఆలయ ప్రాంగణంలో శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం భక్తజన సందోహంతో నిండిపోయింది. కార్తీక సోమవారం పురస్కరించుకొని అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసిన భక్తులు శ్రీ నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ చైర్మన్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక సోమవారం పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో భక్తు