నూతనకల్: నూతన కళ్ళు కు చెందిన రైతు వరి పొలంలో భారత దేశ పటం వైరల్ గా మారిన వీడియో
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలను ఘనంగా వాడవాడల ఊరుల ప్రైవేటు ప్రభుత్వ సంస్థల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కల్లుకు చెందిన రైతు ఇమ్మారెడ్డి రాజ బహుదూర్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో వరినారుతో భారతదేశ పటాన్ని రూపొందించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో శనివారం వైరల్ గా మారింది. రైతు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు మరింతగా కృషి చేయాలని పలువురు సామాజిక మాధ్యమాలలో కామెంట్ చేశారు.