కుప్పం ప్రాంతాన్ని పొగ మంచు కమ్మేసింది. మధ్యాహ్నం 12గంటలు అవుతున్న వాతావరణం ఉదయం 6గంటలను తలపిస్తోంది. ఉదయం నుంచి మంచుకు తోడు చిరుజల్లులు కురుస్తుండడంతో వాతావరణం ఊటీని తలపిస్తోంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. చలిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.