సిర్పూర్ టి: కాగజ్ నగర్ లో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పాల్వాయి
కాకజ్ నగర్ పట్టణంలోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో భగవాన్ బిర్సా ముండా 150 వ జయంతి ఉత్సవాల సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు నివాళులు అర్పించారు. బిర్సా ముండా 25 సంవత్సరాలకు తక్కువ జీవించిన భారత దేశంలోని ఆదివాసి సమాజంపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. బిర్సా ముండా స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జయంతిని జన జాతీయ గౌరవ దివాసుగా జరుపుతుందని కొనియాడారు,