కుందుర్పి మండలం బండమీద పల్లి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆ గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం రోడ్డెక్కారు. అంతేకాకుండా కంప చెట్లను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. తాగునీటి సమస్యను పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. మహిళల ఆందోళనతో ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తాయి. 20 రోజులకు ఒకసారి కూడా తాగునీటిని సరఫరా చేయడం లేదని మహిళలు ఆరోపించారు. మండల పరిషత్, గ్రామపంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.