సిర్పూర్ టి: మొగపల్లి గ్రామ ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరుప్రక్కల ఏర్పడిన భారీ గుంతలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
చింతల మానేపల్లి మండలంలోని మొగపల్లి గ్రామ ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరు ప్రక్కల రెండు భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డుపై వెళ్లాలంటే వాహనదారులు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని వాహనదారులు వణికి పోతున్నారు. ఎవరైనా కొత్త వారు ఈ రోడ్డుపై ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చి ప్రాణాలు కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు,