తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని హై స్కూల్ విద్యార్థులకు మంగళవారం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ విజిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని చందన షాపింగ్ మాల్‌ను విద్యార్థులు విజిట్ చేశారు. షాపింగ్ మాల్ లోని పలు విభాగాల పనితీరు, షాపింగ్ మాల్ లో జరిగే వ్యాపార విధానం, తదితర అంశాలపై హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు షాపింగ్ మాల్ నిర్వాహకులు క్షుణ్ణంగా విద్యార్థులకు వివరించారు.