దసరా సెలవుల నేపథ్యంలో పల్లెబాట పట్టిన పట్టణవాసులు, వందలాది వాహనాలతో కిక్కిరిసిన జాతీయ రహదారి
Nandigama, NTR | Sep 21, 2025 దసరా సెలవులు నేపథ్యంలో పట్టణవాసులు పల్లెబాట పట్టారు. హైదరాబాదు నుండి తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు వేలాది మంది ప్రయాణికులు వందలాది వాహనాల ద్వారా వెళుతున్నట్టడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయింది. నందిగామ సమీపంలోనే టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో వందలాది వాహనాలతో ట్రాఫిక్ నాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.