కోటలో కార్టెన్ సెర్చ్.. సరైన పత్రాలు లేని 25వాహనాలను పోలీస్ స్టేషన్ కి తరలింపు
కోట మండల పరిధిలోని శ్యామసుందర పురం కాలనీలో ఆదివారం ఉదయం నుంచి CI హుస్సేన్ బాషా ఆధ్వర్యంలో కోట ఎస్సై పవన్ కుమార్, వాకాడు, చిట్టమూరు ఎస్సై నాగబాబు, బలరామయ్య, సిబ్బంది కలిసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా జల్లెడ పట్టి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 25 వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. కోట ఎస్సై పవన్ మాట్లాడుతూ.. ఎవరైనా అనుమానితులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంటే తెలియజేయాలన్నారు